విజయవాడ లెనిన్ సెంటర్లో రెడ్ బుక్స్ డే (ఫిబ్రవరి 21, 2026) సందర్భంగా ప్రజానాట్యమండలి అభ్యుదయ గీతాలాపన.
“సామ్రాజ్యవాదం – పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ” పుస్తకావిష్కరణ, పుస్తక పరిచయం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ వామపక్షాల నేతలు, సాహితీవేత్తలు, కవులు, కళాకారులు పాల్గొననున్నారు.



విశాలాంధ్ర విజయవాడ: వామపక్ష సాహిత్యం ప్రపంచానికి అవసరంసామ్రాజ్యవాదం అభివద్ధికి నిరోదం... ఇంకేక్కడ కమ్యూనిస్టులు అనేవారికి భవిష్యత్తే సమాధానం…రెడ్‌బుక్ డే కార్యక్రమంలో వక్తలు.
సామ్రాజ్యవాద దోపిడిదారుల నియంత్రతత్వ పోకడలను అడ్డుకునేందుకు వామపక్ష సాహిత్యం ప్రపంచానికి చాలా అవసరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. విజయవాడలోని లెనిన్ విగ్రహం వద్ద విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, ప్రజాశక్తి బుక్ హౌస్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం రెడ్‌బుక్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాలాంధ్ర విజ్ఞాన సమితి డిప్యూటీ జనరల్ మేనేజర్ టి మనోహర్‌నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ పుస్తకాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, సీపీయం రాష్ట్ర కార్యదర్శి కే శ్రీనివాసరావు తదితర వామపక్ష పార్టీల నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వామపక్షవాదలు, అభ్యుదయవాదులు, ప్రపంచమేధావులు రెడ్‌బుక్ డే పుస్తకాల ఆవిష్కరణల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. కమ్యూనిస్టు భావజాలం ప్రపంచంలో ఉన్నతమైనదని మేధావులు భావిస్తున్న పరిస్ధితులు వస్తున్నాయని తెలిపారు. వామపక్ష విప్లవాత్మక సాహిత్యాన్ని , కమ్యూనిస్టు మ్యానిఫెస్టోను భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ప్రతిఒక్కరిపై ఉందన్నారు. కమ్యూనిజం ఉన్నతమైనది, లెనిన్ భావజాలం ఈ ప్రపంచానికి అవసరమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రెడ్‌బుక్ కోట్లాదిమంది ప్రజలు కొనుగోచేసి అభ్యుదయ భావజాలాన్ని పెంపుదించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కమ్యూనిస్టులకు కాలం చేల్లిందని ఆని మాట్లాడేవారికి సోషలిజం, కమ్యూనిజం విజ్ఞానాన్ని అందించి భవిష్యత్తును మారుస్తుందన్నారు. ఆధిపత్యం పెరుగుతున్న నేటి రోజుల్లో అభ్యుదయం భావంజాలం ఉన్న ఈ పుస్తకాన్ని సమాజానికి అందించాలని సూచించారు.సీపీయం రాష్ట్ర కార్యదర్శి కే శ్రీనివాసరావు మాట్లాడుతూ వామపక్ష సాహిత్యాన్ని విశాలాంధ్ర, ప్రజాశక్తి సంయుక్తంగా అందించేందుకు తొలి అడుగు వేయడం శుభపరిణామన్నారు. ఇదే స్ధాయిలో మరింత విస్తతంగా సమాజానికి అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. 2020లో వాపపక్ష ప్రచురణలు కర్తలు ఏకమై రెడబుక్ ప్రచరణలు ప్రపంచానికి అందించారని తెలిపారు. మార్క్‌రిజం, లెనిన్‌విజం వేలాది బుక్‌లు అమ్మకాలు జరిగాయని తెలిపారు. భవిస్యత్తులో దిమ్మతిరిగే సమాధానం ఇస్తామని తెలిపారు. అన్ని యూనివర్శిటీలో సోషలిజంపై చర్చగోష్టిలు జరుగుతున్నాయని తెలిపారు. సోషలిజం సజీవంగా నిలిచిఉందని ప్రజలందరు భావిస్తున్న పరిస్ధితులు ఉన్నాయని తెలిపారు. తొలుత ప్రజానాట్యమండలి నాయకులు విప్లవ గేయాలు ఆలపించి వీక్షకులను ఆలోచింపజేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, సీపీఐ ఎంఎల్ నాయకులు ఎన్‌డి పి ప్రసాద్, సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు బంగారురావు, సిపిఐ ఎంల్ నాయకులు జె కిషోర్‌బాబు, ఎంఎల్ ఎన్‌డి ఎం రామకష్ణ , ఎంసిపిఐయు నాయకులు కు నాగభూషన్, ఫార్వడ్ బ్లాక్ నాయకులు సుందరరామరాజు, ఆరఖఖఎస్‌పి జానకి రాములు, ఎన్‌యుసి సి అమర్నాథ్, గోళ్ల నారాయరణరావు, సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు.
ఆంగ్లం: A reading of Lenin’s Imperialism, poster exhibition, and other cultural activities on the occasion of Red books day at Lenin centre in Vijaywada, Andhra Pradesh. This was done in coordination with ten left party state secretaries, artists and cultural organisations.


స్పందించండి