ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో సాంస్కృతిక రంగం ఊసేలేదని ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ తెలిపింది. గతంలో యువజన, పర్యాటక, సాంస్కృతిక రంగాలకు కలిపి బడ్జెట్ కేటాయింపులు చేసేవారు. కానీ ఈ బడ్జెట్ లో సాంస్కృతిక రంగాన్ని విస్మరించడం సోచనీయం. సాంస్కృతిక రంగానికి కనీసం రూ. 1000 కోట్లు కేటాయించాలని ప్రజానాట్యమండలి డిమాండ్ చేస్తుంది.
ఇప్పుడిస్తున్న పింఛన్లు కోతపెడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కొత్త వారికి పింఛన్లు ఊసే లేదు. పాత బకాయిల మాటే లేదు. కళాకారులకు, కళా సంస్థలకు, నాటక సమాజాలకు ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిల ప్రస్తావనే లేదు. ప్రభుత్వానికి సాంస్కృతిక విధానం లేదు. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి.
కనీసం జిల్లాకొక ఆడిటోరియం నిర్మించి సాహిత్య, సంగీత కళాశాలకు అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ప్రభుత్వానికి ఉన్నట్లు లేదు. నాటక రంగం, యువత ఆకర్షితమవుతున్న షార్ట్ ఫిలిం రంగాలను ప్రోత్సహించి అభివృద్ధి చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వం గుర్తించి అందుకు అవసరమైన నిధులను కేటాయించాలి. నంది నాటకోత్సవాలకు అవసరమైన బడ్జెట్ కేటాయించి నాటకోత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహించాలి. బడ్జెట్ లో సాంస్కృతిక రంగానికే వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలి.
కళాభివందనములతో..
పి. మంగరాజు
రాష్ట్ర అధ్యక్షులు
ఎస్. అనిల్ కుమార్
రాష్ట్ర కార్యదర్శి


స్పందించండి