మా గురించి

ప్రజానాట్యమండలి అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1943లో స్థాపించబడిన ఒక సాంస్కృతిక సంస్థ. ఇది సామ్యవాద సిధ్దాంతాల ఆధారంగా ప్రజల సమస్యలను వీధి నాటకాలు, పాటలు, నృత్యాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్య పరచడానికి కృషి చేస్తుంది.

కళ కళ కోసం కాదు – ప్రజలకోసం అనే లక్ష్యంతో 1943లో కళాతపస్వి డాక్టర్ గరికపాటి రాజారావు గారు స్థాపించిన ప్రజానాట్యమండలి ఆయన ఆశయాలను కొనసాగిస్తుంది. ఈ కృషిలో భాగంగా గతంలో, వర్తమానంలో రూపొందించిన మహనీయుల జీవిత విశేషాలు పై కళారూపాలు, ప్రజల కోసం నిరతం పోరాడుతున్న ప్రజాసంఘాల పాటలు, దేశభక్తి – అభ్యుదయ పాటలను జనగానం ఛానల్ ద్వారా మీ ముందుకు తెస్తుంది. మీ అందరి ఆదరాభిమానాలు ఈ ఛానల్ కి అవసరం. ప్రజానాట్యమండలి ఆంధ్రప్రదేశ్ కమిటీ అధికారికంగా నిర్వహిస్తున్న జనగానం ఛానల్ ని ఎప్పటిలాగే ఆదరించాలని, మా ఈ కృషికి తోడ్పడాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

నాయకత్వం

చేపట్టిన ఉద్యమాలు